ఏఐ వండర్.. దేశీ వరుడి అవతార్​లో ఎలాన్‌ మస్క్‌.. ఫొటోలు వైరల్

-

అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. నేటి టెక్ ప్రపంచంలో ఏఐతో ఎన్నెన్నో వండర్లు చేస్తున్నారు టెక్కీలు. ఇది సాంకేతిక రంగంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. చాట్ బాట్, చాట్ జీపీటీ వంటివి మానవు జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏఐతో మనషి ఊహాశక్తిని మరింత మెరుగు పరుచుకునే వీలుంటుందని టెక్ నిపుణులు అంటున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఏఐతో మార్ఫ్ చేసిన ఫొటోల హవా మామూలుగా లేదు. ఏఐతో కుబేరులు బికారులైతే ఎలా ఉంటారు..? అబ్బాయిలు అమ్మాయిలైతే ఎలా కనిపిస్తారు.. ఇలా మన ఊహకు నచ్చినట్టు ఫొటోలు ఎడిట్ చేసి చూడొచ్చు. అలా ఓ టెక్కీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫొటోలను ఏఐతో ఎడిట్ చేశాడు. అయితే ఈ అపరకుబేరుడిని బికారిగా చూడాలనుకోలేదు ఆ టెక్కీ.

ఈ ఫారినర్​ను.. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో చూడాలనుకున్నాడు. అది కూడా దేశీ వరుడి అవతారంలో. మస్క్ భారతదేశ వరుడైతే ఎలా ఉంటాడో కళ్లకు కట్టినట్టు చూపించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో మస్క్‌ సంప్రదాయ దుస్తులు ధరించి గుర్రంపై ఊరేగుతున్నట్లు కనిపించాడు. మరికొన్ని ఫొటోల్లో నవ్వుతూ.. వేడుకను ఎంజాయ్‌ చేస్తున్నట్లు కనిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news