విశాఖపట్నం ఎంపీ కుటుంబం కిడ్నాప్‌ పై కేంద్రానికి ఫిర్యాదు !

-

విశాఖపట్నం ఎంపీ కుటుంబం కిడ్నాప్‌ పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు ఎంపీ రఘురామ. విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై నివృత్తి కానీ అనుమానాలు ఎన్నో ఉన్నాయని వెల్లడించారు. ఎంపీ తనయుడు, భార్యను కిడ్నాప్ చేసిన నిందితులు, ఎంపీని డబ్బులు తీసుకొని రమ్మనకుండా ఆయన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వర్ రావు (జీవీ)ను డబ్బులు తీసుకురమ్మని పిలుస్తారా?, ఈ చిన్న లాజిక్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, నగర పోలీస్ కమిషనర్ గారు ఎలా మిస్ అయ్యారన్నది అంతుచిక్కడం లేదంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అపహాస్యం చేశారు.


తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఇంట్లో ఉండాల్సిన భార్య, కుమారుడు కనిపించకుండా పోతే… ఎంపీ గారికి 48 గంటల తర్వాత తెలిసిందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఎంపీ గారి భార్య పిలవగానే ప్రముఖ బిల్డర్, కాంట్రాక్టర్, ఆడిటర్ అయినటువంటి జీవి సొంతంగా కారును నడుపుకుంటూ వెళ్తారా? అని, ఎంపీ గారి భార్య సూచించిన ప్రదేశంలో విడిచి పెట్టమని తన వాహన డ్రైవర్ ను ఎందుకు కోరలేదని నగరంలోని ప్రముఖ కాంట్రాక్టర్, బిల్డర్ అయినా జీవి, 48 గంటలు కనిపించకుండా పోతే ఎవరికి తెలియకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇది కడప, కర్నూల్ గ్యాంగ్ పని అయి ఉండవచ్చునని, ఇందులో నిందితుడిగా పేర్కొన్న హేమంత్ కు సంబంధం లేదని, పోలీసులు అల్లిన కట్టు కథ ఇదని అన్నారు.

హేమంత్ అనేవాడు ఆకు రౌడీ మాత్రమేనని, అటువంటి వారు చిల్లర డబ్బుల కోసం హత్యలు చేస్తారని, ఆస్తి తగాదాలలో భాగంగానే ఈ కిడ్నాప్ జరిగి ఉండవచ్చునని, క్రిస్టియన్ ఆస్తుల లావాదేవీలలో, మరికొన్ని ఆస్తి లావాదేవీలలో ఒక పెద్ద మనిషి తాలూకాకు చెందిన వాళ్లు వీరిని కొట్టి సంతకాలను పెట్టించుకున్నట్లు ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారని అన్నారు. జీవీని చితక బాదడంతో ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత ఆయన చేత కావలసిన అబద్ధాన్ని చెప్పిస్తారని, ఇది ఆస్తి తగాదాల కోసం కాదని, కేవలం డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ అని గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా పోలీసులు కథనం వినిపించడం విస్మయాన్ని కలిగిస్తోందని అన్నారు. ఈ పూర్తి సంఘటనపై ఎన్ఐఏ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి తాను లేఖ రాస్తానని రఘురామకృష్ణ రాజు లిపారు.

Read more RELATED
Recommended to you

Latest news