విశాఖలో హత్య చేసిన వెంకటేష్..వాలంటీర్ కాదట. వాల్తేరులో వరలక్ష్మీ అనే మహిళ ను వెంకటేష్ అనే వాలంటీర్ హత్య చేసిన ఘటన గురించి అన్ని దినపత్రికలు రాయగా, సాక్షి దినపత్రిక మాత్రం అందరికీ భిన్నంగా వార్తా కథనాన్ని ప్రచురించిందని రఘురామకృష్ణ రాజు అన్నారు. నగల కోసం ఓ మహిళ హత్య అన్న శీర్షికతో వార్తా కథనాన్ని ప్రచురించి వెంకటేష్ అనే వ్యక్తి గతంలో వాలంటీర్ గా పనిచేసేవాడని పేర్కొందని, అతని పనితీరు బాగా లేకపోవడంతో జూలై 27వ తేదీన విధుల్లో నుంచి అతన్ని తొలగించారని వివరించారు రఘురామకృష్ణ రాజు.
30వ తేదీన వాలంటీర్ ఒక మహిళను హత్య చేస్తే, అంతకు మూడు రోజుల ముందే అతన్ని విధుల్లో నుంచి తొలగించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సాక్షి దినపత్రిక ఎన్ని కథనాలు రాసినా మహిళను వాలంటీర్ చేసిన హత్య, హత్య కాకుండా పోతుందా? అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్నో తప్పులు జరుగుతున్నాయని తెలిసే, ఈ విధంగా వార్త కథనాల ద్వారా కవరింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 74 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక ఆరోపణలు చేయడం దారుణమని, మీ ఇంట్లో పొరపాటున రంకు ఉంటే, దేశంలోని అందరికీ రంకు కట్టేస్తారా?, వావి వరుసలు అన్నవి లేవా??, అసలు మానవత్వం అన్నది లేదా?, 74 ఏళ్ల మహిళా వృద్ధురాలుపై సోషల్ మీడియాలో ఈ విధంగా రాతలు రాస్తున్న వారి మోహన, రాయిస్తున్న వారి మోహన ప్రజలు కాండ్రించి ఉమ్మి వేయాలని రఘురామకృష్ణ రాజు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.