ఏపీలోని మహిళలకు గౌరవం లేదు – రఘురామ

-

 

తల్లి, చెల్లితో సహా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఒక్క మహిళను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు గౌరవంగా చూడడం లేదని, నిరాదరణకు గురి చేస్తున్నారని, ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రేమగా చూసుకునేది ఆయన శ్రీమతి, కూతుర్లను మాత్రమేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. తల్లిని, చెల్లిని వెళ్ళగొట్టి నాకు ఎవరూ లేరు మొర్రో అని ఆయన అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

తల్లిని, చెల్లిని జగన్ మోహన్ రెడ్డి గారు దారుణంగా నిర్లక్ష్యం చేశారని, అయినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలలో తల్లిని చెల్లిని చూసుకుంటున్నారని అనుకున్నాం.. అది కూడా ఉత్తి భ్రమేనని తేలిపోయిందని అన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లతో పాటు మున్సిపల్ కార్మికులు రోడెక్కారని, అంగన్వాడీలు చేస్తున్న పోరాటం అనితర సాధ్యం అని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అంగన్వాడీలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 31 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నప్పటికీ, వారు అంగన్వాడీల తరహాలో తమ నిరసనను తెలియజేయలేక పోతున్నారని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చంకలు నాకడానికి ఉన్నట్టు వ్యవహరించడం దారుణం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news