విజయవాడ ఆస్పత్రి ఘటనలో బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం

-

విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై ఒక సీఐ, ఎస్సైలను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ కూడా చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. నిందితులు ఫాగింగ్‌ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి… వారిని విధులనుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీచేశారు. విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్‌ ఏజెన్సీకి టెర్మినేషన్‌ నోటీసు జారీ చేశారు. సీఎస్‌ ఆర్‌ఎంఓకి షోకాజ్‌ నోటీసు జారీచేశారు. శాఖా పరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. నివేదిక తర్వాత మరిన్ని చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version