హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించాలని వెంటపడుతూ.. ప్రేమకు అంగీకరించకపోవడంతో కత్తితో యువతిపై దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతున్న అనూష అనే యువతిని ప్రేమ పేరుతో వేధించాడు అజహర్ అనే వ్యక్తి. ప్రేమను తిరస్కరించడంతో కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. హన్మకొండలోని పోచమ్మ గుడి దగ్గర ఈ ఘటన జరిగింది.
ప్రేమోన్మాది ఘాతుకం… ప్రేమించడం లేదని యువతి గొంతు కోసిన యువకుడు
-