ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల భారీ వర్షాలు కురిసి బుడమేరు గండ్లు తెగిపోవడంతో విజయవాడ అతలకుతలమైన విషయం తెలిసిందే. తాజాగా సీఎం చంద్రబాబు వరద బాధితులకు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు వచ్చాయని తెలిపారు చంద్రబాబు. వరద సమయంలో ఊహించని రీతిలో బుడమేరుకు వరద పోటెత్తింది. వరద సమయంలో ఉద్యమ స్ఫూర్తితో పని చేశామని తెలిపారు. పది రోజుల్లో 1కోటి 15లక్షల ఫుడ్ ప్యాకెట్ పంపిణీ చేశామని తెలిపారు.
గత ప్రబుత్వం గండ్లు పూడ్చకపోవడం వల్లనే బుడమేరుకు వరద ప్రవాహం వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఓ వైపు వర్షం నీరు వస్తే.. మరోవైపు బుడమేరు నీరు పోటెత్తిందని తెలిపారు. అందరి ప్రోత్సాహంతో తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడ్డామని తెలిపారు. వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే.. అంతా ముందుకొచ్చారు. సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం చరిత్రలో రికార్డు అన్నారు. సీఎం సహాయనిధికి సాయం చేసిన వారందరికీ పాదాభివందనాలు తెలిపారు చంద్రబాబు. నాతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారని కొనియాడారు.