నటి శ్రీరెడ్డి మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ పై నోరు పారేసుకుంది. ఏపీలో ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ విషయం పై చాలా ఫోకస్ చేశారు. లడ్డూ వివాదాన్ని చులకనగా చూసినా, మాట్లాడినవారిపై తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్నారు.పవన్ దెబ్బకు ఇప్పటికే ప్రకాశ్ రాజ్, తమిళ హీరో కార్తీ సైతం వెంటనే దిగొచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మీద నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
గతంలో వైసీపీ పార్టీకి, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఈమె సపోర్టుగా ఉన్నారు. టీడీపీ నేతలను, మాజీ మంత్రులను ఓ ఆటాడుకున్నారు. తన పరుష పదజాలంతో దూషణలు చేసిన శ్రీరెడ్డి తాజాగా పవన్ మీద కూడా అవే కామెంట్స్ చేశారు. ‘హిందూత్వం పేరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే యెదవ, క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నపుడు ఈ సనాతన ధర్మాన్ని ఏ సంతలో అమ్మేసావురా సన్నాసి?? కమ్యూనిస్టు భావాలు అంటవ్, దీక్షలంటవ్ ఏమన్నా మ్యాచింగ్ ఉందా? అసలు దీపంతో సిగరెట్ వెలిగించుకున్నవాడికి’.. అంటూ డిప్యూటీ సీఎం పవన్‌పై ఘాటు విమర్శలు చేసింది. దీంతో జనసేన ఫ్యాన్స్, ఫాలోవర్స్ శ్రీరెడ్డిని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు.