AP: 65 లక్షల మందికి రూ.7వేల పెన్షన్

-

కేబినెట్‌లో పెన్షన్ల పెంపు అంశంపై చర్చ జరిగింది. రాష్ట్రంలో జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని నిర్ణయించారు. రూ.3వేల నుంచి రూ.4వేలకు పెన్షన్ల పెంపును ఆమోదించారు. ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలు రూ. 3 వేలను ప్రభుత్వం చెల్లించనుంది. దీంతో వచ్చే నెలలో ఒకేసారి రూ.7వేలను 65 లక్షల మంది లబ్ధిదారులు అందుకోనున్నారు.

AP Cabinet meeting on 24th of this month

అటు కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ సమావేశంలో రాష్ట్రమంత్రి వర్గం మెగా డీఎస్సీకి ఆమోదం తెలిపింది. టెట్ పరీక్ష నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణ వంటి రెండు ప్రతిపాదనలు ఈ భేటీలో తెరపైకి వచ్చాయి. వీటిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news