హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. కొత్తగా 1020 సిటీ బస్సులు

-

హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త. ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు టిఎస్ఆర్టిసి ప్రతిష్ట ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా అన్ని వర్గాల ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొత్త సదుపాయాలు, కార్యక్రమాలను అమల్లోకి తెస్తుంది.

తాజాగా నగర ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా మరికొన్ని బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఏకంగా 1020 సిటీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది టిఎస్ఆర్టిసి.

ఈ కొత్త బస్సుల్లో సూపర్ లగ్జరీ, ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఉన్నాయి. ఈ బస్సులను సొంతంగా కొనుగోలు చేయనుంది టీఎస్ఆర్టీసీ. గ్రేటర్ లో ఇప్పటికే పాత సిటీ బస్సులు 720 ఉండగా వాటిని తుక్కు కింద మార్చనున్నట్టు అధికారులు వెల్లడించారు. జిల్లాలో పాతబడిన సూపర్ లగ్జరీ బస్సులను గ్రేటర్ లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టిసి అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news