సంక్రాంతికి ఇంటికి వెళ్లే వారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జనవరి 6 నుంచి 18 వరకు అన్ని ప్రాంతాలకు రెగ్యులర్ తో పాటు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది.
అయితే ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ చార్జీలే వసూలు చేస్తామని వెల్లడించింది. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు 1000 ప్రత్యేక బస్సులు నడుపుతామని పేర్కొంది. ఈ బస్సులకు ముందుగానే టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించనుంది.
అటు సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ కూడా అదిరిపోయే శుభవార్త చెప్పింది. సంతూర్లకు వెళ్లే వారి కోసం ఏకంగా 4233 స్పెషల్ ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. వచ్చే ఏడాది జనవరి 7వ నుంచి 15 వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడవనన్నట్లు కీలక ప్రకటన చేసింది ఆర్టీసీ.