4.93 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం : సజ్జల

-

ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో 4.93 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని.. ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. చంద్రబాబు పాలనలో తలసరి ఆదాయంలో 17వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు 9వ స్థానంలో ఉన్నామని సజ్జల చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. 2019లో ఆంధ్రప్రదేశ్ జీఎన్డీపీ 22వ స్థానం కాదా 2022లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని వెల్లడించారు.

16,500 కోట్లతో ప్రభుత్వ బాడల రూపురేఖలు మార్చామని సజ్జల తెలిపారు. వ్యవసాయంలో గత హాయంలో 27వ స్థానంలో ఉంటే అప్పట్లో వృత్తి రేటు 6.5 శాతం ఉండేదని చెప్పారు ప్రస్తుతం వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉందని వృద్ధిరేటు 8 శాతం సాధించామని తెలిపారు. తలసరి ఆదాయంలో ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నామని ఈ మేనిఫెస్టో నే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి గీటురాయని సజ్జల తెలిపారు. గురువారం నుంచి వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమము ప్రారంభం అవుతుందని సజ్జల వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news