ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

-

ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో రియలా..? ఫేకా..? అనేది తేలాకే చర్యలుంటాయని తేల్చి చెప్పారు. అరగంటలోనో.. గంటలోనో రిపోర్ట్ వస్తుందని టీడీపీ అంటోందని.. రిపోర్టు ఇంకా రాలేదు.. విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.

కొన్నాళ్లు ఆగితే కొంపలేం మునిగిపోవని.. మాధవ్ తనను వేధించారనే ఫిర్యాదు కూడా ఎవరి దగ్గర నుంచి లేదని వెల్లడించారు. మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహరం కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దదని.. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్ అవునా..? కాదా..? అనేది ఇంకా తేలలేదనే విషయం గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు.

ఏడేళ్లైనా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్ పై క్లారిటీ రాలేదని గుర్తు చేశారు. మాధవ్ కు సంబంధించి ఒరిజినల్ బయటికి రాలేదని, ఆ వీడియోను ఇంకో వీడియోగా షూట్ చేసింది మాత్రం బయటికొచ్చిందని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అన్నీ ఒరిజినల్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఒక పార్టీకి అధినేత అని, మాజీ ముఖ్యమంత్రి అని, ఏదో సామాన్య కార్యకర్త కాదని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news