లక్ష కోట్లతో రాజధాని నిర్మించడం ఏంటి..ఒక్క ప్రాంతానికే పెట్టడం అవసరమా ? అంటూ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణానికి నిధులే ప్రధాన అడ్డంకి అని.. డెడ్ లైన్ విధించి అభివృద్ధి చేయమంటే సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. ఎకరాకు 2కోట్లు అవసరం అవుతుందని సీఎం లెక్కలతో సహా అసెంబ్లీ వేదికగా చెప్పారని.. కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎలా అని నిలదీశారు.
నిధులు ఉంటే సింగపూర్ కాకపోతే దాని తాతను రాజధానిగా నిర్మించవచ్చని.. ఆచరణ సాధ్యం కానీ ఆదేశాలు కాబట్టి సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారని గుర్తు చేశారు. మంత్రి వర్గం విస్తరణ మొత్తాన్ని సీఎం చూస్తున్నారని.. సీఎం జగన్ సోషల్ జస్టిస్ కు అనుగుణంగానే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నా రన్నారు. బిసి,ఎస్సి,ఎస్టీలకు పెద్ద పీట వేసేలా క్యాబినెట్ ఎక్సర్సైస్ ఉంటుందని.. మెజార్టీగా క్యాబినెట్ లో మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణ.