YSR ఆలోచనలు, ఆదర్శాలు, దార్శనికత, ప్రేమకు వారసుడు జగన్ అన్నారు సజ్జల. ఇవాళ వైసీపీ కార్యాలయంలో వై.యస్.రాజశేఖరరెడ్డి 74వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ సెంట్రల్ ఆఫీసులో జయంతి వేడుకలతో పాటు, పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి వెళుతూ వెళుతూ తన కొడుకును మనకు అప్పగించి వెళ్ళారని తెలిపారు. ఇలాంటి కలయిక ప్రపంచం లోనే అరుదుగా ఉంటుందని వెల్లడించారు. రాజశేఖరరెడ్డికి ఉన్న దార్శనికత, ప్రజల పట్ల ప్రేమ మరింత అన్నారు. వైఎస్ఆర్ కుమారుడిగానే కాదు ఆయన ఆలోచనలు, ఆదర్శాలు, దార్శనికత, ప్రేమకు వారసుడు జగన్ అని.. ఇటువంటి జగన్ తో కలిసి నడుస్తున్నందుకు మనం అందరం గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందన్నారు.