ఈ రోజు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ముఖ్యంగా రైతులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అయన రైతులకోసం చేసిన సేవను మరియు తీసుకొచ్చిన ఎన్నో పధకాలను గుర్తు చేసుకుంటూ వైఎస్సార్ ను స్మరించుకున్నారు. తాజాగా మాజీ సుప్రీమ్ కోర్ట్ జడ్జ్ మరియు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా అబ్దుల్ నజీర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈయన ట్విట్టర్ వేదికగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ఎంతో కష్టపడ్డారని.. ఆ కృషిని ఇప్పటి రెండు రాష్ట్రాల రైతులు ఇప్పటికే మరిచిపోలేరని వైఎస్సార్ ను కొనియాడారు నజీర్. ఈయన సీఎంగా ఉన్న సమయంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టారన్నారు.
ఇక రైతుల కోసం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులను ఎంత పొగిడినా తక్కువే అన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. అందుకే వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నారని వైఎస్సార్ పై తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.