ఏపీలో భారీ వర్షాలు.. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటన!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. ఇవాళ పలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని… వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కూడా… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని… వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Schools in Various Districts in AP Closed Due to Heavy Rainfall

ముఖ్యంగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య కర్నూలు నంద్యాల నెల్లూరు ప్రకాశం బాపట్ల గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలకు.. రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అంతేకాదు ఈ మూడు జిల్లాలలో.. స్కూళ్లకు హాలిడేస్ కూడా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news