విద్యార్థులకు అలర్ట్ : నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

-

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. వేసవి సెలవులు పూర్తికావడంతో ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు ఉన్నాయి. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం స్కూల్లో మిర్చింగా పూర్తి కావడంతో… విలీనమైన బడులలోని మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులు సమీపంలోని ఫ్రీ హై స్కూల్ అలాగే హై స్కూల్ కు వెళ్ళనున్నారు.

ఇక మరోవైపు తొలి రోజు నుంచే విద్యార్థులకు విద్యా కానుక అందించనుంది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగానే… ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు పట్టణంలోని మున్సిపల్ క్రీడామైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఏర్పాట్లను పరిశీలించారు.ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 10.20 నుంచి 10.30 వరకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో వినతిపత్రాలు తీసుకోనున్న సీఎం… 10.45 నుంచి 10.50 వరకు మున్సిపల్ స్కూల్ ను సందర్శించనున్నారు.10.55 నుంచి 11.15 వరకు నాయకులు, అధికారులను కలవనున్న సీఎం… సభలో విద్యార్థులకు విద్యా కానుక పంపిణీ చేసి ప్రసంగిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news