పల్నాడు గ్రామాలలో వేడి ఎక్కడా కూడా తగ్గలేదు. దీంతో పల్నాడు జిల్లాలో నేడు కూడా 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. అలాగే పలు వ్యాపార సంస్థలు మూసి వేసే అవకాశం ఉంది. గడిచిన ఐదు రోజులుగా పలనాడు గ్రామాల్లో రాజకీయ దాడుల నేపద్యంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు ప్రధాన పార్టీల నాయకులు ఘర్షణలు పడటంతో, పల్నాడు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది 144 సెక్షన్.
గ్రామాల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబుల కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఘర్షణలో పడే వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. సమస్యాత్మక గ్రామాలను జల్లెడ పడుతున్నాయి పోలీస్ బలగాలు. పలువురు చోటా,నాయకుల ఇళ్లల్లో మారణాయుధాలు దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి , జెసి ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ప్రధాన కూడళ్లలో పోలీసుల గస్తీ ఉంది.