మంత్రి అంబటిపై మాజీ అల్లుడు సంచలన కామెంట్స్.. వీడియో వైరల్​

-

ఏపీలో రాజకీయం రంజుగా మారుతోంది. ఓవైపు అధికార వైసీపీ.. మరోవైపు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ ఇరు వర్గాలపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇక చాలా మంది నేతలతు ఇంటి నుంచి సెగ తగులుతోంది. కుటుంబ సభ్యులే అభ్యర్థులపై విమర్శలు చేస్తూ రాష్ట్రంలో మరింత వేడి రాజేస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబుకు కూడా ఆయన కుటుంబం నుంచే దెబ్బ తగిలింది.

అంబటి రాంబాబు చిన్న అల్లుడు డాక్టర్ గౌతమ్  ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఓటేయొద్దంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.  అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి ఓటు వేయొద్దంటూ  అల్లుడు వీడియో విడుదల చేశాడు. మంచితనం, మానవత్వం లేని వ్యక్తి అని అలాంటి అంబటి రాంబాబు లాంటి వారికి ఓటేస్తే సమాజం నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీంతో ఓటర్లు ఆలోచనలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version