కాంగ్రెస్ చేసిన అన్యాయాలను బీజేపీ సరిదిద్దింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సభలో మాట్లాడారు. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవని గుర్తు చేసారు. కాంగ్రెస్ హయాంలో విపరీతమైన అవినీతి, కుంభకోణాలు జరిగాయని తెలిపారు.

దేశంలో అవినీతి రహిత ప్రభుత్వం ఉండాలని.. 2014లో ప్రజలు మోడీని నాయకుడిగా ఎన్నుకుంటారని పేర్కొన్నారు. ఈ పదేళ్లలో కాంగ్రెస్ చేసిన అవినీతి, కుంభ కోణాలు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన అవినీతి, అక్రమాలు మోడీ ఈ పదేళ్లలో సరిదిద్దారని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలను భారత్ వైపు చూసేలా అభివృద్ధి వైపు నడిపించారని పేర్కొన్నారు. మూడోసారి ప్రజలు మోడీని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతి మరక లేకుండా బీజేపీ దేశాన్ని పాలించిందని వివరించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version