పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక అంశాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అదేంటంటే పోలరం ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే కేంద్రం నిధులు ఇస్తుందని పునరావాసంతో కేంద్రానికి ఏమాత్రం సంబంధంలేదని ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.
2016 సెప్టెంబర్ నాటి కేంద్ర ఆర్ధిక శాఖ మెమో ప్రకారం పోలవరం నిర్మాణానికి అవసరమయ్యే నిధులు మాత్రమే కేంద్రం భరిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు కేవలం 20 శాతం పునరావాసం మాత్రమే పూర్తయింది. 2014 నాటి ఒప్పందం ప్రకారమే నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో RTI ద్వారా వచ్చిన తాజా అంశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. అంటే ఇప్పుడు కేంద్రం తప్పేమీ లేదనే భావించాలన్న మాట !