సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి పేరుతో భూకబ్జా దారుల బెదిరింపులు సంచలనంగా మారాయి. కబ్జా చేసిన స్దలం దగ్గరకు వస్తే ముక్కలుగా నకుతానంటూ వార్నింగ్ ఇచ్చారు కబ్జా రాయుళ్ళు. మంచిగా చెబుతున్నా వినకపోతే నీ ఇష్టం, రేపు అంబటి కూడా వస్తున్నారు. అక్కడే నీ అంతు తెలుస్తానంటూ బెదిరింపులు పర్వం వెలుగులోకి వచ్చింది.

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితుడు భాను ప్రసాద్ (55) సిద్దమయ్యాడు. 174 సర్వే నెంబర్ లో స్థలం గల బాధితుడిని ఫోన్లో బెందిరించారు. 2017లో 11 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశాడు బాధితుడు. అయితే భూ కబ్జా బాధితులంతా కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి దాకా గుట్టుగా ఉన్న వ్యవహారం మీడియాకి ఎక్కడంతో చంపుతానంటూ కబ్జరాయుళ్ళు హెచ్చరికలు జారీ చేస్తూ రికార్డింగ్ లలో దొరికిపోయారు.