ట్విట్టర్ ప్లాట్ ఫామ్ లో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు డైరెక్ట్ మెసేజ్ (డిఎం) ద్వారా వాయిస్ సందేశాలను రికార్డ్ చేయడానికి మరియు పంపడానికి కొత్త ఫీచర్ కి సంబంధించి ట్విట్టర్ కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయోగాలు చేస్తుంది. ట్విట్టర్ లో డిఎమ్‌ల కోసం ప్రొడక్ట్ మేనేజర్ గా ఉన్న అలెక్స్ అకెర్మాన్- గ్రీన్‌బెర్గ్, కంపెనీ త్వరలో వాయిస్ డిఎమ్ లను పరీక్షించబోతోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
వాయిస్ డిఎంలను బ్రెజిల్ లో పరీక్షించే అవకాశం ఉంది. ఫేస్ బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ లో ఇప్పటికే ఈ ఆడియో రికార్డింగ్ ఫీచర్ ఉంది. ఈ ఏడాది జూన్ లో ట్విట్టర్ యుఎస్ లో పరిమిత సంఖ్యలో ఐఓఎస్ వినియోగదారుల కోసం ఆడియో స్నిప్పెట్లను రికార్డ్ చేయడానికి మరియు ట్వీట్లకు అటాచ్ చేయడానికి ఒక పరీక్ష కూడా చేసింది.