ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎట్టకేలకు బుధవారం రోజున పోలీసు నియామక మండలి ఈ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 411 పోస్టులకు 18,637 మంది అర్హత సాధించారు. పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ఫలితాలు ఉంచారు. తుది రాతపరీక్షకు సంబంధించిన పేపర్-3, పేపర్-4 సమాధాన పత్రాలను ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ రాష్ట్ర పోలీసు నియామక మండలి పేర్కొంది. సందేహాలకు 9441450639, 9100203323 ఫోన్ నెంబర్లు సంప్రదించాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్ అతుల్‌సింగ్ సూచించారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సై ఉద్యోగాలకు మొత్తం 1,51,288 మంది ప్రాథమిక రాత పరీక్ష రాయగా.. వారిలో 57,923 మంది అర్హత సాధించారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో. 31,193 మంది తుది రాతపరీక్షకు ఎంపికై చివరి పరీక్షలో 18,637 మంది అర్హత సాధించారు. ప్రతిభావంతుల జాబితా రూపొందించి రోస్టర్ ప్రకారం మెరిట్‌లో నిలిచిన 411 మందిని పోస్టులకు ఎంపిక చేయనున్నారు.