సిద్ధార్థ హత్య కేసులో అసలు నిందితురాలు ఆమెనే..!

-

బెంగళూరులో హత్య చేసి, నెల్లూరులో పాతి పెట్టిన మాజీ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్‌ బంధువైన సిద్ధార్థసింగ్‌ (28), సింగ్‌ హత్య కేసులో అసలు నిందితలు వెలుగులోకి వచ్చారు. అతని సవతి తల్లే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలైన ఇందూ చౌహాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇందూ చౌహాన్‌ సిద్ధార్థ తండ్రి దేవేందర్‌ సింగ్‌కు రెండో భార్య. ఆమెనే సిద్ధార్థను మట్టుబెట్టాలని నిర్ణయించి తిరుపతికి చెందిన శ్యాంసుందర్‌ రెడ్డి, వినోద్‌లకు సుపారీ అందించి హత్య చేయించినట్లు తమ విచారణలో వెల్లడైందని బెంగళూరు డీసీపీ సీకే బాబా స్పష్టం చేశారు.

సీటు బెల్టుతో బిగించి..

గత నెల 19న సిద్ధార్థను శ్యాంసుందర్‌రెడ్డి, వినోద్‌ కారులో కిడ్నాప్‌ చేసి కారులోని సీట్‌ బెల్టుతో మెడకు బిగించి ప్రాణం తీశారు. ఆ తర్వాత నేరుగా నెల్లూరు జిల్లా రాపూర్‌ సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి ఆ ప్రాంత తహసీల్దార్‌ సమక్షంలో వెళికి తీసి పంచనామా అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. సిద్ధార్థ అమెరికాలో చదువు పూర్తి చేశాడు. అమృతహళ్లి పరిధిలోని దాసరహళ్లి అపార్ట్‌ మెంట్లో ఒంటరిగా ఉంటూ ఓ అంకుర పరిశ్రమ పడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆస్తి వివాదాలు, వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. ఈ హత్యలో మరికొందరి ప్రమేయమున్నట్లు అనుమానాలు వస్తున్నాయని పోలీసులు, కుటుంబీకులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news