ఏపీలో భారీగా తగ్గిపోయింది పేదరికం. దీంతో జగన్ సర్కార్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. గడిచిన పదేళ్ల లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని నీతి అయోగ్ కొనియాడింది. ఆంధ్రరాష్ట్రంలో పేదరికం 11.77% నుంచి 6.06 శాతానికి తగ్గిందని తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో పురోగతి మరింత అద్భుతంగా ఉందని, అక్కడ పేదరికం 14.72% నుంచి 7.71 శాతానికి తగ్గిందని పేర్కొంది. వంటగ్యాస్ లేని వారి సంఖ్య 37.90% నుంచి 16.09 శాతానికి తగ్గిందని చెప్పింది. మాత, శిశు సంరక్షణ, శానిటేషన్, హౌసింగ్, విద్యలోను ప్రగతి సాధించినట్లు తెలిపింది.
ఇది ఇలా ఉండగా, APSRTC ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రజా రవాణాను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1500 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచినట్లు సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అదేవిధంగా 250 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అద్దె బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించారు.