రాజకీయ జీవితంలో నిత్యం ప్రజల కోసం పోరాడిన నేత సీపీఎం సీనియర్ నాయకుడు సీతారం ఏచూరి. అయితే తాజాగా సీతారాం ఏచూరి మరణించిన విషయం తెలిసిందే. సీపీఎం ప్రధాన కార్యదర్శి, వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి మరణం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయ, సామాజిక, వామపక్ష పోరాటాలలో ఆయన చేసిన పాత్రను కొనియాడుతున్నారు.
సీతారాం ఏచూరి విషయంలో ఆయన కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య పరిశోధన కోపం సీతారాం ఏచూరి పార్థివ దేహం. తన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని గతంలోనే కోరారు సీతారాం ఏచూరి. దీంతో ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి డొనేట్ చేశారు. సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఉండవని సీపీఎం ప్రకటించింది. సీతారాం ఏచూరి కోరిక మేరకు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి కుటుంబ సభ్యులు ఆయన పార్థివ దేహాన్ని అప్పగించనున్నారు.