సోమశిల జలాశయం ప్రమాదంలో ఉంది : మంత్రి నిమ్మల

-

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ ఒకే సీఎం ఉండకూడదనే విధంగా వ్యవహరిస్తున్నారు. 2014లో నారా చంద్రబాబు నాయుడుని సీఎంగా ఎన్నుకుంటే.. 2019లో వై.ఎస్. జగన్ ని సీఎంగా ఎన్నుకున్నారు. 2024లో మళ్లీ చంద్రబాబును ఎన్నుకున్నారు. ఇలా కంటిన్యూగా ఎవ్వరూ ఉండకూడదని నిర్ణయించుకుంటున్నారు ఏపీ ప్రజలు.

ఇదిలా ఉంటే.. జగన్  ప్రభుత్వం లో ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా  అధ్వాన్నంగా మారాయని అన్నారు మంత్రి నిమ్మల రామా నాయుడు. ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు లా ఇద్దరు మంత్రులు నెల్లూరు జిల్లా నుంచి పని చేశారని విమర్శించారు. ఒకటవ కృష్ణుడు  ఇరిగేషన్ మంత్రిగా ఉండి.. సోమశిల జలాశయం ను తెగి పోయోలా చేశాడని  పేర్కొన్నారు. ప్రస్తుతం సోమశిల జలాశయం చాలా  ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. కొత్త జలాశయాలు ఇప్పుడు కట్టలేమని చెప్పారు. ఉన్న జలాశయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సోమశిల జలాశయం పనులు రెండు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి నిమ్మల రామా నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news