తాడిపత్రి అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు : జేసీ ప్రభాకర్ రెడ్డి

-

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు అని మున్సిపల్ చైర్మన్  జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. బై పాస్ రోడ్లలో చెత్త వేస్తే కేసులు నమోదు చేస్తాం. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తే.. దుర్వాసన వెదజల్లి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. అదేవిధంగా నల్ల బండలలో పాలిష్ వృధా రాళ్లు రోడ్ల పక్కన వేస్తే.. ట్రాక్టర్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

చుక్కలూరు రోడ్డు పారిశ్రామిక వాడలో పరిశ్రమల వేస్ట్ రాళ్లు రోడ్డు పక్కన వేస్తే పరిశ్రమలకు కరెంట్ బంద్ చేయిస్తామని తెలిపారు. తాడిపత్రి అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితులలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. చుట్టు పక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాడిపత్రి మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంచడం కోసమే ీ నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news