జమ్మూ కశ్మీర్ సీఎం అతనే.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..

-

పదేళ్ల తర్వాత జమ్మూలో జరిగిన ఎన్నికలు కాంగ్రెస్కు అధికారాన్ని అప్పగించాయి.. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌‌లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ఘన విజయం సాధించింది. ఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోన్నాయి. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన బిజేపీకి నిరాశ తప్పలేదు.. జమ్మూలో హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనావేసినా.. కాంగ్రెస్ కూటమి మెజార్టీ స్థానాలను గెలుచుకుని అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి..

మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలను బిజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికల రావడంతో ఎక్కడా ఛాన్స్ తీసుకోలేదు.. అవసరమైన అన్ని అస్త్రాలను ప్రయోగించినా.. ప్రజలను బిజేపీకి మద్దతు ఇవ్వలేదు.. ఆ పార్టీ ఏ మాత్రం కూడా ప్రభావాన్ని చూపలేకపోయింది. జమ్మూ కాశ్మీర్‌కు గల స్వయ ప్రతిపత్తి హోదాను తొలగించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మలచడం కాశ్మీర్ ఓటర్లకు రుచించలేదు.

90 అసెంబ్లీ స్థానాలకు గాను.. కాంగ్రెస్ ఎన్సిపి కూటమి 49 స్థానాల్లో గెలవగా.. బిజెపి 29 స్థానాలకే పరిమితమైంది.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అవసరమైన సంఖ్యాబలం ఉండటంతో.. ఇప్పుడు సీఎం ఎవరనే చర్చ మొదలైంది.. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా సీఎం కుర్చి తమదేనని క్లారిటీ ఇచ్చారు.. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అవుతారని ఫరూఖ్ ప్రకటించారు. త్వరలోనే శాసన సభాపక్ష నేతగా ఆయనను ఎన్నుకుంటామని అన్నారు. ఎన్నికల పొత్తుల సమయంలోనే సీఎం పదవిపై ఇరు పార్టీలు ఓ క్లారిటీతో ఉన్నాయని.. అందులో భాగంగానే.. ఫరూఖ్ అబ్దుల్లా అలా మాట్లాడారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు..

జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ ప్రాబల్యం పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.. బిజేపీ వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది.. దాంతోపాటు.. కశ్మీర్ కు రాష్ట హోదా ఇస్తామని హామీ ఇవ్వడంతోపాటు.. ప్రశాంత కశ్మీర్ కు చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో.. దీనిపై ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news