నేడు గవర్నర్ ని కలవనున్న సోము వీర్రాజు.. ఫిర్యాదు చేసేందుకే !

ఈరోజు ఏపీ గవర్నర్ అపాయిట్మెంట్ తీసుకున్నారు ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు. ఈరోజు ఉదయం 11.30కి గవర్నర్ ను సోము వీర్రాజు కలవనున్నారు. అంతర్వేది రథం దగ్ధం, ఇతర ఆలయాలలో జరిగిన ఘటనలను గవర్నర్ కు సోము‌ వీర్రాజు ఈ సంధర్భంగా వివరించనున్నారు. చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు‌ చేసిన వారిని పోలీసులు అరెస్టులు‌ చేసిన సంగతి తెలిసిందే.

అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేసిన వారి వివరాలు, దాడుల పట్ల ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆధారాలతో సోము వీర్రాజు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ అంతర్వేది ఘటన మీద సీబీఐ ఎంక్వైరీ వేసిన సంగతి తెలిసిందే. అయితే తాము అరెస్ట్ చేసిన వారు అంతా అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వచ్చిన వారే నని ప్రభుత్వం చెబుతోంది. అంతర్వేదిలోని చర్చ్ మీద కొందరు దాడి చేయడంతో దానిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.