ఏపీలో పెళ్లి సందడి.. ఇవాళ లక్షకుపైగా వివాహాలు

-

శ్రావణ మాసం వచ్చేసింది. ఇటీవల వరలక్ష్మీ వ్రతం కూడా అయిపోయింది. ఇక ఇవాళ రాఖీ పండుగ కూడా జరుపుకుంటున్నాం. ఈ శుభ మాసంలో శుభకార్యాలకు లెక్కే ఉండదు. ఈనెల 8 నుంచి పెళ్లిళ్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. ఇక ఈనెల 28 వరకు శుభ ముహూర్తాలున్నాయి. ఈ నేపథ్యంలో శుభకార్యాలు జోరందుకున్నాయి.

ఇక ఇవాళ శుభమైన రోజు. అందువల్ల ఈరోజు పెద్ద ఎత్తున శుభకార్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో పెళ్లి సందడి నెలకొంది. ఆదివారం రోజున మంచి ముహూర్తం ఉండటంతో వేలాది జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యాయి. ఇవాళ అంతకుమించి లగ్గాలు జరగనున్నాయి. దాదాపు లక్షకుపైగా జంటలు ఇవాళ ఏపీలో ఒక్కటి కానున్నాయి. ఇక ఈనెల 22, 24 కూడా మంచి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ఈవెంట్లకు నాలుగైదు నెలలముందే మండపాల బుకింగ్‌లు జరిగిపోయాయి. ఏపీలో ఏ ఊరూ వాడ చూసినా.. పెళ్లి సందడే కనిపిస్తోంది. భాజా భజంత్రీలే వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news