కోల్ కత్తాలో ఓ జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఆమెకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరుగకూడదని వైద్యులు గత కొద్ది రోజులుగా వైద్యాన్ని నిలిపివేసి బంద్ పెట్టిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా తెలంగాణకు చెందిన ఓ బాధితురాలు సీఎం రేవంత్ రెడ్డికి ఓ ట్వీట్ ద్వారా విన్నవించింది.
గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా కూతుర్ని కాపాడండి. నా పేరు సుశీల, నా కూతురు జ్యోతి వయసు25. నిన్న నా కూతురు బిల్డింగ్ పై నుంచి కింద పడింది. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇక్కడ స్కానింగ్ చేసి తన వెన్న బొక్క మరియు ఎడమ కాలు విరిగినది. సర్జరీ చేయాలనీ చెప్పారు. కానీ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ఉండడం వళ్ళ ఇక్కడ కుదరదు అని చెప్పారు. ఇంకా ఇక్కడ న్యూరో సర్జన్ డాక్టర్ గారు స్ట్రైక్ లో ఉన్నారని చెప్పారు. నా కూతురు ప్రాణం చాలా ప్రమాదంలో ఉంది. అయ్యా కలకత్తాలో చనిపోయిన లేడీ డాక్టర్ కూడా ఒక నా కూతురిలాంటిదే.. దయచేసి నా కూతురిని కాపాడగలరని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసింది బాధితురాలు.