కొత్త జిల్లాలు ప్రకటించిన రెండు వారాల్లోనే సిబ్బంది సర్దుబాటు : ఏపీ

-

ఆంధ్రపద్రేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్వాటుకు రంగం సిద్ధమవుతుంది. అందులో భాగంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వేతనాల చెల్లింపు ఆధారంగా సమాచారాన్ని ఆన్ లైన్లో పొందుపరుస్తోంది. ఉద్యోగుల స్వస్థలం, విధుల్లో చేరిన తేదీ, సీనియారిటీ, ఇతర ముఖ్యమైన వివరాలను నిర్ణీత నమూనాలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటోంది. ఇదీలా ఉండగా కొత్త జిల్లాలను ప్రకటించిన రెండు వారాల్లోగా అధికారులు, ఉద్యోగులను సర్దుబాటు చేసేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.

జిల్లాలు ఏర్పాటు చేసిన వెంటనే కొత్త కలెక్టర్ నియామకాలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఆర్థికశాఖ సీనియర్ అధికారి ఒకరు జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. వెంటనే నియామకాలు చేపడతామని తెలిపారు. అంతేకాకుండా జిల్లాకు ముగ్గురు జేఏసీలను నియమిస్తామని పేర్కొన్నారు. సీనియారిటీని అనుసరించి ఐఏఎస్‌లు కలెక్టర్లు అవుతారు. ముగ్గురు జేసీలలో ఇద్దరు ఐఏఎస్‌లు.. మరొకరు నాన్‌ ఐఏఎస్‌ కేడర్‌. వీరిని యథాతథంగా కొనసాగిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. చిన్న జిల్లాలు అయినందున వారి సంఖ్యను పరిమితం చేయవచ్చని అనుకుంటున్నారు. సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే మాత్రం జిల్లాకు ముగ్గుర్ని కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొనసాగించే పక్షంలో ఐఏఎస్‌లు ఎక్కువ మంది కావాలి.

జిల్లా శాఖలను పర్యవేక్షిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే వారి అధికారుల స్థానాలు ఎవరు భర్తీ చేస్తారని అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ‘ఎ’ నుంచి ‘హెచ్‌’ వరకు సెక్షన్లు ఉన్నాయి. ఇవికాకుండా ‘ల్యాండ్‌ రిఫార్మ్స్‌’ సెక్షన్‌ ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4 జోన్లు ఉన్నాయి. కొత్త జోన్లు కావాలంటే రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా ఏర్పాటు చేస్తారో.. ఉద్యోగుల సంఖ్య పెంచుతారా లేదా తగ్గిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news