పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేం : సుప్రీంకోర్టు

-

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నియమాలపై జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్వర్వులపై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పార్టీ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

పోస్టల్‌ బ్యాలెట్ల ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫాం-13ఏ’ పై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉంటే చాలు, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర (సీలు) లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటవుతాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న జారీచేసిన ఉత్తర్వులపై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఆ పార్టీ ఆదివారం రోజున సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని, పిటిషనర్‌కు ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ వైకాపా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news