రేవంత్ రెడ్డి సీఎం కావొచ్చు.. కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడు – హరీష్‌ రావు

-

రేవంత్ రెడ్డి సీఎం కావొచ్చు.. కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడని ఆగ్రహించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు. రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేదు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కావొచ్చు, సీఎం కావొచ్చు.. కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడు…తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహిగానే చరిత్రలో మిగిలిపోతాడు తప్ప.. ఏనాటికీ ఉద్యమకారుడు కాలేడని చురకలు అంటించారు.

harish rao in siddipet

సిద్దిపేటలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ…తెలంగాణ రాష్ట్రానికి అత్యంత అవసరమన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుక…కేసీఆరే తెలంగాణకి శ్రీరామ రక్ష పేర్కొన్నారు. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన యాడ్ లో జై తెలంగాణ అనే పదం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అన లేదు..ఆయన ఎప్పటికీ తెలంగాణ ఉద్యమ కారుడు కాలేడని వివరించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్య మ ద్రోహి అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news