జగన్‌ గెలుపుపై 30 కోట్ల బెట్టింగ్‌.. వైసీపీ సర్పంచ్ అనుమానాస్పద మృతి !

-

ఏలూరు జిల్లా నూజివీడులో విషాదం చోటు చేసుకుంది. నూజివీడులో వైసీపీ సర్పంచ్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామ వైఎస్ఆర్సిపి సర్పంచ్ విజయ లక్ష్మి భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద మృతి చెందాడు. సుమారు 30 కోట్ల వరకు ఎన్నికల ఫలితాల బెట్టింగ్ కు మధ్యవర్తిగా ఉన్నాడు వేణుగోపాల్ రెడ్డి.

Suspicious death of YCP Sarpanch in Nujiveedu

అయితే.. ఏపీ ఎన్నికల ఫలితాలు నుండి గ్రామంలో కనిపించలేదు వేణుగోపాల్ రెడ్డి. ఇక అటు రెండు రోజుల క్రితం పందెం రాయుళ్లు వేణుగోపాల్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. నేడు గ్రామంలో ని మల్బరీ షెడ్ లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు వేణుగోపాల్ రెడ్డి. అయితే… వేణుగోపాల్ రెడ్డి చనిపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది గ్రామం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news