తాడిపత్రి పాలిటిక్స్‌..పెద్దారెడ్డి, అస్మిత్ రెడ్డిలకు ఊరట

-

 

అనంతపురం జిల్లా తాడిపత్రి వైఎస్సాఆర్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి,టిడిపి అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డి లకు హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాడిపత్రి నియోజకవర్గంలోకి వెళ్ళవద్దంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డికి సూచించింది హైకోర్టు. తాడిపత్రిలోనే కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు సిట్ అధికారుల మకాం వేయనుంది.

Tadipatri YSSR CP candidate Ketireddy Peddareddy and TDP candidate JC Asmit Reddy in High Court

639 మంది అల్లర్లు , రాళ్లదాడిలో తాడిపత్రి వైఎస్సాఆర్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి,టిడిపి అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డిల వర్గీయులు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు….ఇప్పటికే 102 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అల్లర్లలో పాల్గొన్న నిందితులందరూ ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితులను అరెస్టు చేయడానికి చర్యలు వేగవంతం చేశారు పోలీసు అధికారులు. కౌంటింగ్ రోజు తాడిపత్రిలో బయట వారు రాకుండా అష్టదిగ్బంధం చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news