మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

-

మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఐదు సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యం అన్నారు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఈ పరిశ్రమలను ఆనాడు చొరువతో తీసుకొచ్చామన్నారు.

అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖ పై దృష్టి సారించినట్టు తెలిపారు. ముందుచూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి ఆదాని సంస్థతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశామన్నారు. కానీ అది ఆగిపోయింది. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదు. ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. బాధకరమైన పరిస్థితి ఏంటంటే.. గతంలో హైదరాబాద్ లో రేస్ జరిగింది. దీనిని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి.. కోడి గుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారు. ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్లినా ఐటీ మంత్రి ఇలా ఉంటారా..? అని ఏపీ రాష్ట్రానికి అవమానం జరిగిందని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news