కడప టీడీపీ పార్టీలో ముసలం నెలకొంది. కడపలో విష సంస్కృతికి తెరలేపారని టీడీపీ నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు భయంతో బ్రతకాల్సిన పరిస్థితి ఉందని… స్వంత పార్టీ నేతల నుంచి నాకు ప్రాణహాని ఉందని బాంబ్ పేల్చాడు. కేసును పోలీసులు సైడ్ ట్రాక్ లోకి తీసుకెళ్లారు..చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లినప్పుడు దీక్ష శిబిరాలకు నా సొంత డబ్బులు 90 లక్షలు ఖర్చు పెట్టానని గుర్తు చేశారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే తొమ్మిది కుట్లు పడేలా బహుమతి ఇచ్చారని ఆగ్రహించారు. దాడి కేసు విషయంలో అన్యాయం జరిగింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు పోలీసులు అల్లిన కథలో రియాలిటీ లేదన్నారు. కేసులో కనబరచిన వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదని మండిపడ్డారు. ఆ వ్యక్తి లక్కిరెడ్డి పల్లె వాసి.. అతను ఒక కుటుంబానికి వీరవిధేయుడు.. ఈ విషయం జిల్లా ప్రజలకు బాగా తెలుసు అని తెలిపారు. త్వరలో కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు, లోకేష్ ను కలిసి జరిగిన అన్యాయంపై వివరిస్తానని ప్రకటించారు.