పుంగనూరు వివాదంపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు..పోలీసులపై చర్యలు !

-

ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ గవర్నరును కలిసింది టీడీపీ బృందం. పుంగనూరు- తంబళ్లపల్లెలో జరిగిన దాడులపై గవర్నరుకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. పోలీసులే టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారని కంప్లైంట్ చేశారు. ఏకపక్షంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి అందించారు టీడీపీ నేతలు. వైసీపీ నేతలు చేసిన దాడుల వీడియోలు గవర్నరుకు అందజేసిన టీడీపీ బృందం…వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తల ఫోటోలు గవర్నరుకు చూపించింది.

దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేస్తున్నారు…వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దాడులు, హత్యలు చేసేస్తారా..? అని ఫైర్ అయ్యారు. నిన్న పుంగునూరులో చంద్రబాబుపై రాళ్ల దాడి.. నేడు పల్నాడులో టీడీపీ సానుభూతిపరుడు కోటయ్య తల పగలకొట్టారు…పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు కోటయ్యపై రెండోసారి దాడికి తెగబడ్డారు వైసీపీ గూండాలు అంటూ ఫైర్‌ అయ్యారు. కేసు నమోదు చేయకుండా వైసీపీ నేతలకు పోలీసులు కాపు గాస్తున్నారు….ఎన్ని దాడులు చేసినా జగన్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news