BREAKING : స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించిన టీడీపీ

-

BREAKING : స్కిల్ డెవలప్మెంట్ కేసుపై టీడీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించింది టీడీపీ పార్టీ. ఈ కేసులో ప్రజలకు వాస్తవాలు తెలిచేసేందుకు అన్ని వివరాలను వెబ్ సైటులో రూపొందించామని టీడీపీ పార్టీ వెల్లడించింది. ఇవాళ మధ్యాహ్నాం 2 గంటలకు వెబ్ సైట్ ప్రారంభించనున్నారు అచ్చెన్నాయుడు సహా ఇతర సీనియర్ నేతలు.

TDP has created a special website on the case of skill development

ఇది ఇలా ఉండగా, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. అయితే తాజాగా ఆయన అరెస్టు సహా ఇతర పరిణామాలపై కేంద్ర హోంశాఖకు ఎన్‌ఎస్‌జీ నివేదిక అందించింది. సెప్టెంబర్ 8 తేదీ అర్ధరాత్రి నుంచి 10 తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు జరిగిన అరెస్టు, ఏసీబీ కోర్టు రిమాండ్, జైల్లో భద్రత తదితర అంశాలను నివేదికలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version