మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని ఓ క్వారీలో క్వార్ట్జ్ ను అక్రమంగా వెలికి తీస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు.
పనులు నిలిపి వేయాలంటూ తాటిపర్తి సమీపంలో మూడు రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి పోలీసులు అక్కడికి చేరుకొని దీక్షను భగ్నం చేసి సోమిరెడ్డిని ఇంటివద్ద దించి వెళ్లారు.