వైసీపీ నేతల బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు టీడీపీ ఎమ్మెల్యే థామస్. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ థామస్… అనంతరం వైసిపి నాయకులపై హాట్ కామెంట్ చేశారు. మా కార్యకర్తల ఇబ్బంది పెడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదని… వాళ్లు ఓవర్ యాక్షన్ చేస్తే తోక కట్ చేస్తాం…బట్టలు ఊడదీసి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. మేం డెవలప్మెంట్ కోసం వచ్చాం మా మైండ్ ని మా టైం ని డైవర్ట్ చేయకుండా ఉంటే మంచిదని వెల్లడించారు.
ఎస్ఆర్ పురం మండలంలో ఉన్న అధికారులు ముందు ఎలా ఉన్నారో నాకు తెలియదు…. ముందున్న మినిస్టర్ ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు నాకు తెలియదని వివరించారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు అన్ని డిపార్ట్మెంట్ ఫర్ఫెక్ట్ గా జరగాలని తెలిపారు. అవినీతి చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అవినీతి చేసేవాళ్లు దయచేసి ఈ నియోజకవర్గ వదిలిసి వెళ్లిపోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే థామస్.