తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ కు చేదు అనుభవం ఎదురైంది. అర్వపల్లి వద్ద సొంత పార్టీ నేతల నుంచే తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ కు నిరనస సెగ ఎదురైంది. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.
ఇందులో భాగంగానే… తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ వాహనాన్ని అడ్డుకోబోయారు ఆందోళన కారులు. ఎమ్మెల్యే సామెల్ తమకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూనే.. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. కాగా మందుల సామేల్ మొదటి సారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసందే.
- జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మందుల సామేలుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు