టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టును ఆశ్రయించారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. హఫీజ్ పేటలో తమ భూమిని హైడ్రా అన్యాయంగా స్వాధీనం చేసుకుందని పిటిషన్ దాఖలు చేశారు.

తమ భూముల్లో ఉన్న నిర్మాణాలను సైతం కూల్చేశారని అందుకు హైడ్రా నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్… హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా కూల్చివేతలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్… మాకు ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి రాగానే ఆయనను కలుస్తాను.. ముఖ్యమంత్రి తప్పకుండా నాకు న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు ఉందని తెలిపారు. హైడ్రా కరెక్ట్ అయితే కోర్టుకు సెలవు ఉన్న రోజే వచ్చి ఎందుకు కూల్చివేతలు జరుపుతోంది ? అని పేర్కొన్నారు.