కెనడాలో హిందూ ఆలయంపై దాడి

-

కెనడాలోని ఓ హిందూ ఆలయంపై దాడి చోటుచేసుకుంది. ఆ దేశంలో సిక్కు వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. ఖలిస్థానీ జెండాలతో ఏప్రిల్ 19వ తేదీన సర్రేలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయం వద్ద హంగామా చేశారు. ఆలయంపై దాడులు చేయడంతో దేవాలయ ప్రవేశద్వారం, స్తంభాలు ధ్వంసం అయ్యాయి. శనివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇద్దరు దుండగులు ఖలిస్థానీ నినాదాలు చేస్తూ..ఆలయంలోకి ప్రవేశించారని అధికారులు తెలిపారు. స్తంభాలు, ద్వారాలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాశారని వెల్లడించారు. ఆధారాలు దొరకకుండా సీసీటీవీ కెమెరాలను దొంగలించారని.. అలాగే ఆలయంపై దాడి చేయడంతో ప్రవేశద్వారం, స్తంభాలు ధ్వంసమైనట్లు చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే ఇటువంటి ద్వేషపూరిత విధ్వంసాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన వెనుక భారత వ్యతిరేక శక్తుల హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news