ఏపీ అసెంబ్లీలో టీడీపీ రచ్చ…సైకో పాలన పోవాలి అంటూ నినాదాలు

-

ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రెండో రోజు కూడా చంద్రబాబు అరెస్ట్‌ చుట్టూ రచ్చ జరుగుతోంది. స్కిల్ స్కాం అంశాన్ని అజెండాలో స్వల్ప కాలిక చర్చ లో పెట్టింది ఏపీ ప్రభుత్వం. అయితే.. చంద్రబాబుపై కేసు ఎత్తేయకుండా చర్చ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ పార్టీ సభ్యులు. చంద్రబాబు అరెస్టు ఎత్తేయాలని వాయిదా తీర్మానం పై పట్టుబడుతున్నారు టీడీపీ సభ్యులు.

ap assembly1
ap assembly1

అంతేకాదు.. నిన్నటి లాగే.. స్పీకర్ పోడియం ఎక్కి ప్లకార్డుల ప్రదర్శన చేస్తున్నారు. సైకో పాలన పోవాలి అంటూ నినాదాలు చేస్తున్నారు టీడీపీ పార్టీ సభ్యులు. దీంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్‌ తమ్మినేని. ఇక అటు టీడీపీ సభ్యుల వాదనపై అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ పై సరైన ఫార్మాట్ లో రాకుండా టీడీపీ నేతలు గందరగోళం సృష్టించారని.. చంద్రబాబు అవినీతి పై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మండిపడ్డారు అంబటి రాంబాబు. టీడీపీ ఉద్ధేశం చర్చ కాదు..రచ్చ… శాసనసభలో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేయాలేనేదే టీడీపీ ఉద్ధేశం అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news