పెంచిన వ్యాట్ ఇడుపులపాయ నేలమాళిగల్లోంచి తీసి కడతారా ?

న్యాచురల్ గ్యాస్ పై పన్ను పెంచితే ప్రజల పై భారం పడదు లోకేష్ అసత్య ప్రచారం చేయిస్తున్నారు అని సజ్జల రెడ్డి గారు సెలవిచ్చారని, మరి పెంచిన పన్ను భారం ఎవరి మీద పడుతుంది.10 శాతం పెంచిన వ్యాట్ ఇడుపులపాయ నేలమాలిగాల్లోంచి తీసి కడతారా అని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ప్రశ్నించారు. పెంచిన వ్యాట్ వల్ల వంట గ్యాస్ వినియోగదారుల పై భారం పడదా? కొన్ని జిల్లాల్లో పైప్డ్ గ్యాస్ ని వంట గ్యాస్ గా వినియోగిస్తున్న సంగతి సజ్జలకు తెలీదా అని ఆయన ప్రశ్నించారు.

సిఎన్జీ తో నడిచే ఆటోలు, ఇతర వాహనాల పై పడే భారం ప్రజల మీద పడదా ? అని ఆయన ప్రశ్నించారు. మీరు పెంచిన భారం ప్రజల పై పడదు అంటున్నారు మరి ఎవరి మీద పడుతుందో చెప్పే దమ్ముందా?ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రయాణికుడి పై భారం లేదంటారు,ఇసుక ధర పెంచి ఇల్లు కట్టుకునేవాడికి నష్టం లేదంటారని దీపక్ రెడ్డి ఎద్దేవా చేశారు. మద్యం ధరలు పెంచింది మత్తు ఎక్కకుండా ఉండేదుకు అని కవరింగ్ ఇస్తారని, మీటర్లు పెడతాం కానీ రైతుకి మోత ఉండదు అంటారు, విద్యుత్ ఛార్జీలు పెంచి వాడుకుంటే షాక్ కొట్టదా అని పేద వాడిని అవమానిస్తారని ఆయన గుర్తు చేశారు.